News January 6, 2025
కడప: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.
Similar News
News December 8, 2025
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా జట్టు ఘన విజయం

గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ పోటీల్లో ఈస్ట్ గోదావరిపై కడప జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. కడప 16 ఓవర్లలో 171 పరుగులు చేయగా.. ఈస్ట్ గోదావరి 145 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్ ప్రవీణ్ 41 బంతుల్లో 85 పరుగులతో వీరవిహారం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ వెంకటయ్య, వైస్ కెప్టెన్ సుబ్బరాయుడు ప్రవీణ్ను అభినందించారు. క్రీడాకారులను పలువురు ప్రశంసించారు.
News December 8, 2025
కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.
News December 8, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780


