News February 6, 2025

కడప: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు

image

బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని చౌదరి వారి పల్లి గ్రామంలో 25 మంది రైతులు నకిలీ వరి విత్తనాలతో మోసపోయారు. ఖాజీపేట మండలంలోని ఓ దుకాణంలో గత నెలలో వరి విత్తనాలు కొనుగోలు చేసి వరి పైరు సాగు చేశారు. 25 రోజులకే వరిలో వెన్ను రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ విత్తనాల వల్లనే వరి పైరు ఇలా ముందే వెన్నుదశలోకి వెళ్లిందని బాధిత రైతులు గురివి రెడ్డి, పెద్ద వీరారెడ్డి వాపోయారు.

Similar News

News November 10, 2025

పుష్పగిరి ఆలయంలో ఒకే పలకపై శివపార్వతి కుటుంబ విహార శిల్పం

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై ఉన్న అద్భుత కుడ్య శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేశ్ వివరించారు. ఈ శిల్పంలో శివపార్వతులు నందిపై, వారి కుమారులు వినాయకుడు (మూషికంపై), సుబ్రహ్మణ్య స్వామి (నెమలిపై) కుటుంబ సమేతంగా విహరిస్తున్నట్టు చిత్రీకరించారు. మకర తోరణం, అష్టదిక్పాలకులు కూడా ఈ శిల్పంలో చెక్కబడ్డాయి. ఇది ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక అని తెలిపారు.

News November 9, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్‌ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2025

మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

image

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.