News June 15, 2024

కడప: నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ

image

ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఫౌండేషన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ అయిన 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులని తెలిపారు. 35 రోజుల శిక్షణా కాలంలో కంప్యూటర్ స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతామన్నారు.

Similar News

News October 24, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

image

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News October 23, 2025

కడప జిల్లాలో 2,661 హెక్టార్లలో పంట నష్టం: DAO

image

వర్షాల వల్ల కడప జిల్లాలోని 63 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) చంద్ర నాయక్ తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం 2,661 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. వరి-1,970 హెక్టార్లు, కంది-258 హెక్టార్లు, మినుము-228 హెక్టార్లు, వేరు శనగ-84 హెక్టార్లు, పత్తి-81 హెక్టార్లు, మొక్కజొన్న-40 హెక్టార్లలో దెబ్బ తిన్నాయని వివరించారు.

News October 23, 2025

కడప: తుఫాన్.. విద్యుత్ సమస్యలపై కాల్ చేయండి.!

image

వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*కడప జిల్లా కంట్రోల్ రూమ్ 94408- 17440,
*కడప డివిజన్ -99017 61782
*పులివెందుల – 78930-63007
*ప్రొద్దుటూరు -78932-61958
*మైదుకూరు-98490 57659
విద్యుత్ ప్రమాదాలు జరిగితే పై నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.