News October 31, 2024
కడప నుంచి బెంగళూరు బయలుదేరిన జగన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.
Similar News
News November 28, 2025
కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో నిన్నటికి, ఈరోజుకు తేడా లేదు. వెండి స్వల్పంగా రూ.30లు పెరిగింది. ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము: రూ.12,590
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము: రూ.11,583
☛ వెండి 10 గ్రాములు: రూ.1680