News June 19, 2024
కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలి: MP
కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలని సీఎం రమేశ్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి మంగళవారం వినతి పత్రం అందించారు. ఉడాన్ పథకంతో దేశీయ ట్రూజెట్ సంస్థ 2018లో కడప నుంచి నాలుగు ప్రాంతాలకు రెగ్యులర్‌గా విమాన సర్వీసులు ప్రారంభిస్తే, వైసీపీ వీజీఎఫ్ చెల్లించక సర్వీసులు నిలిపివేసిందని ఆరోపించారు. కడప-ముంబయి, కడప- హైదరాబాద్ విమానాలను రెగ్యులర్‌గా నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News September 17, 2024
కడప: తెగిపడిన యువకుడి చెయ్యి
నందలూరు రైల్వే కేంద్రంలో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుష్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రైలులో పుత్తూరుకు వెళుతూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగింది. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
News September 16, 2024
చాపాడు: ఢివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం
మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2024
కడప: గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
చిన్నమండెం మండల వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి కోలాహలం మొదలైంది. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలు డప్పులు, మేళతాళాలు, బాజా భజంత్రీలు, బాణసంచా పేలుళ్ల నడుమ బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.