News August 21, 2024

కడప: నూతన ఓటు హక్కు చేర్చుకునే అవకాశం

image

కడప జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, కొత్తగా ఓటు హక్కును చేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. 1.1.25 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు ఓటర్ లిస్ట్ నందు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని సూచించారు. అలానే ఓటు కార్డు నందు సవరణలు ఏవైనా ఉన్నయెడల సవరించుకోవచ్చని స్థానిక ఎమ్మార్వో, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News October 14, 2025

ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి: కడప SP

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. అదనపు SP (అడ్మిన్) ప్రకాశ్ బాబు ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం చేయాలని పోలీసులు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 158 పిటీషన్లను చట్టం ప్రకారం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్న కార్యక్రమంలో ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేశారు.

News October 14, 2025

తిప్పలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌కు అంతరాయం

image

ఎర్రగుంట్ల మండలం కమలాపురం వెళ్లే రహదారిలోని తిప్పలూరు వద్ద సోమవారం రాత్రి కంటైనర్ -లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోగా అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డుకు ఇరువైపుల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News October 13, 2025

కడప: అయ్యో రితిక్.. అప్పుడే నూరేళ్లు నిండాయా.!

image

కడపలో రైలు కింద పడి <<17990131>>కుటుంబం ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన కలచి వేస్తోంది. శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, 18 నెలల వయసు ఉన్న కుమారుడు రితిక్‌తో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్నారి రితిక్ మృతి చెందడం పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. అభం శుభం తెలియని వయసులో ఏం జరుగుతుందో తెలియక, తన తల్లి రైలు కిందకు ఎందుకు తీసుకుని వెళ్తుందో అర్థం కాక చిన్నారి మృతి చెందడం బాధాకరం.