News August 23, 2024

కడప: నేటినుంచి అండర్ -23 క్రికెట్ టోర్నీ

image

కడపలోని YS రాజారెడ్డి క్రికెట్ స్టేడియం మైదానంలో ACA సౌత్ జోన్ అండర్-23 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు వారు తెలిపారు. టోర్నమెంట్‌లో సౌత్ జోన్‌కు చెందిన కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం పాల్గొంటున్నట్లు తెలిపారు.

Similar News

News December 4, 2025

కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

News December 4, 2025

నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.

News December 4, 2025

కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్‌లు ఉన్నాయి.