News October 14, 2024
కడప: నేటినుంచి యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం

కడప జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఆరిఫ్ తెలియజేశారు. నగరంలోని కెనరా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సెల్ ఫోన్ రిపేరింగ్ -సర్వీసింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ విభాగాలలో శిక్షణ ఉంటుందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
Similar News
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
News January 10, 2026
గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.
News January 10, 2026
యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.


