News December 2, 2024
కడప: నేడు జరగాల్సిన వైవీయూ డిగ్రీ పరీక్ష వాయిదా

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రద్దయిన పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత తెలియజేస్తామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేడు జరగాల్సిన పరీక్షలు మాత్రమే రద్దు చేశామన్నారు.
Similar News
News February 7, 2025
పులివెందుల: రాజహంస వాహనంపై శ్రీనివాసుడు

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రాజ హంస వాహనంపై సరస్వతీ రూపంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
News February 6, 2025
దస్తగిరి రెడ్డి ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ జైలులో ఇబ్బంది పెట్టారని వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డాక్టర్ చైతన్య రెడ్డి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు. రేపు ఉదయం కడప జైలులో దస్తగిరి రెడ్డితో పాడు వారిద్దరినీ విచారణ అధికారి రాహుల్ ప్రశ్నించనున్నారు.
News February 6, 2025
కడప: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు

బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని చౌదరి వారి పల్లి గ్రామంలో 25 మంది రైతులు నకిలీ వరి విత్తనాలతో మోసపోయారు. ఖాజీపేట మండలంలోని ఓ దుకాణంలో గత నెలలో వరి విత్తనాలు కొనుగోలు చేసి వరి పైరు సాగు చేశారు. 25 రోజులకే వరిలో వెన్ను రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ విత్తనాల వల్లనే వరి పైరు ఇలా ముందే వెన్నుదశలోకి వెళ్లిందని బాధిత రైతులు గురివి రెడ్డి, పెద్ద వీరారెడ్డి వాపోయారు.