News August 29, 2024

కడప: నేడు జిల్లా వ్యాప్తంగా ITIల్లో కౌన్సిలింగ్

image

కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో 3వ విడత అడ్మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు వారు దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ఐటీఐలలో కౌన్సిలింగ్ జరుగుతుందని ప్రభుత్వ మైనారిటీ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్‌తోపాటు ఫోటో, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.

Similar News

News February 18, 2025

ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయాలి: ఎస్పీ

image

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా విచారించి సత్వరమే న్యాయం చేయాలన్నారు.

News February 17, 2025

ఒంటిమిట్టకు చేరిన శ్రీవారి లడ్డూలు

image

ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయానికి సోమవారం తిరుమల శ్రీవారి లడ్డూలు వచ్చాయి. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన 1500 లడ్డులను సిబ్బంది ఆలయంలోనికి తీసుకువెళ్లారు. గతంలో రెండవ శనివారం, నాలుగవ శనివారం ఇచ్చే లడ్డూలు, గత కొన్ని నెలలుగా ప్రతిరోజు ఇస్తున్న విషయం తెలిసిందే.

News February 17, 2025

వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: ఎస్పి

image

కడప జిల్లాలోని హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా ఎస్.పిఅశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు ఇతర సిబ్బందికి కడప జిల్లా పోలీస్ మైదానంలో రెండు వారాల మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోం గార్డ్‌గా చేరకముందు తీసుకున్న శిక్షణను మరోసారి గుర్తు చేసుకుంటూ మొబలైజేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు.

error: Content is protected !!