News September 30, 2024
కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-24437 ల్యాండ్ లైన్ నంబర్కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Similar News
News November 8, 2025
ప్రొద్దుటూరు: అధికార పార్టీనే వీరి అడ్డా..!

ప్రొద్దుటూరు క్రికెట్ బుకీల గురించి వైసీపీ, టీడీపీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పేరుమోసిన క్రికెట్ బుకీలంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటున్నారు. అధికార పార్టీ నుంచి కౌన్సిలర్లుగా, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. 2014-19లో టీడీపీలో ఉన్న క్రికెట్ బుకీలు, 2019లో వైసీపీలోకి జంప్ అయ్యారు. 2024లో వైసీపీ ఓడిపోగానే మళ్లీ టీడీపీలోకి వచ్చారు. క్రికెట్ బుకీలు అధికారం అండలోనే ఉంటున్నారు.
News November 8, 2025
కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరికి 3 ఏళ్లు జైలు

2019 అక్టోబర్ 11న యర్రగుంట్ల మహాత్మా నగర్లో కులం పేరుతో బంగ్లా రమేష్పై దూషణ, కాళ్లు చేతులతో తన్ని కట్టెలతో కొట్టిన కేసులో ఇద్దరికి కడప 4వ ఏ డీజే కోర్టు 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసును డీఎస్పీ సూర్యనారాయణ విచారించగా, ప్రత్యేక పీపీ బాలాజీ సమర్థవంతమైన వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


