News September 30, 2024
కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Similar News
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
News December 13, 2025
కడప జిల్లాకు భారీగా నిధులు

కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.5కోట్ల నిధులు నీతి అయోగ్ విడుదల చేసిందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్, ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి అయోగ్ కార్యదర్శి శేఖర్కు కలెక్టర్ శ్రీధర్ న్యూఢిల్లీలో వివరించారు.
News December 12, 2025
కడపలో హత్య.. వివాహేతర సంబంధమే కారణమా.?

కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ <<18541025>>హత్యకు వివాహేతర సంబంధమే<<>> కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


