News September 22, 2024

కడప: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి

image

అందరికి న్యాయం అందాలని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హై కోర్ట్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కడప పోలీస్ పెరేడ్‌లోని మీటింగ్ సమావేశంలో జిల్లా స్థాయి జుడీషియల్ అధికారుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. అమలవుతున్న యాక్ట్స్‌పై న్యాయవాదులు నిబద్ధతతో చట్టాలను అమలు చేయాలని సూచించారు.

Similar News

News October 13, 2024

ప్రొద్దుటూరు: దసరా వేడుకల్లో దారుణం

image

ప్రొద్దుటూరులో దసరా అమ్మవారి గ్రామోత్సవంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. సుధీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున కత్తితో పొడిచిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారిలో ఆందోళన నెలకొంది. సహాయం కోసం సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి, సుధీర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2024

కడప: దసరా వేడుకల్లో అపశ్రుతి.. గాయపడిన వ్యక్తి మృతి

image

కడప నగరంలో దసరా వేడుకలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని బెల్లం బండి వీధిలో దసరా ఊరేగింపులో దురదృష్టవశాత్తూ పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఈ కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మరణించింది. మిగతా వారు చికిత్స పొందుతున్నారు.

News October 12, 2024

నేడు కడప – అరక్కోణం రైలు రద్దు

image

చెన్నై సమీపంలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ళను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్ళను రద్దు చేశారు. అందులో భాగంగా కడప నుంచి అరక్కోణం వెళ్ళే రైలు నం 06402 నేడు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.