News January 2, 2025
కడప పట్టణాన్ని నిర్మించిన రాజు మీకు తెలుసా?
దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణాలలో కడప పట్టణం ఒకటి. పెన్నా నది ఒడ్డున మొదటి కడప పట్టణాన్ని తమిళ రాజు కరికాల చోళుడు నిర్మించినట్లు తమిళ సంఘ సాహిత్యంలోని తల్కాపియం అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. కరికాల చోళుని పేరు మీదనే కడప అనే పేరు వచ్చింది. అప్పటి జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం సిద్ధపటం కోట. ఈ కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉండడం విశేషం. కంచి ఏకాంబరేశ్వరబాబు ఆలయంలో వీరి విగ్రహం ఉంది.
Similar News
News January 8, 2025
కడప: 7వ రోజు పకడ్బందీగా కానిస్టేబుల్ దేహారుడ్య పరీక్షలు
ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహారుడ్య పరీక్షలను కడప జిల్లా కేంద్రంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్ర మైదానంలో జిల్లా ఇన్‌ఛార్జి విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో కట్టుదిట్టంగా నిర్వహించారు. 7వ రోజు దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.
News January 7, 2025
తొండూరులో తల్లీ, కూతురు దారుణ హత్య
పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం తుమ్మలపల్లిలో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధరరెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి (37), కుమార్తె గంగోత్రి (14)లను గొంతులు కోసి హతమార్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 7, 2025
కడప జిల్లా ప్రజలు భయపడకండి: డాక్టర్లు
కడప జిల్లాకు సమీపంలో ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కడప రిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని అన్నారు.