News August 29, 2024

కడప: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పటిష్ఠం చేయాలి

image

ఎంఎస్ఎంఈ 1989 యాక్ట్ నిబంధనల మేరకు.. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పటిష్ఠం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ, జిల్లా విపత్తుల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 17, 2025

కడప కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేడుక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆ తర్వాత సభా భవనంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాలు మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రజల అర్జీలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.

News February 16, 2025

కడప: చాడీలు చెప్పాడని కత్తితో దాడి

image

కడప నగరంలో యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఎర్రముక్కపల్లి సమీపంలోని చికెన్ అంగడి యజమాని అస్లాం వద్ద ఇర్ఫాన్, ఖలీల్ పనిచేస్తున్నారు. ఖలీల్, ఇర్ఫాన్‌పై చాడీలు చెప్పడంతో యజమాని ఇర్ఫాన్‌ను పనిలో నుంచి తీసేశాడు. దీంతో ఆగ్రహించిన ఇర్ఫాన్ ఖలీల్‌పై కత్తితో శనివారం దాడి చేశాడు. గాయపడిన ఖలీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖలీల్ ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.

News February 16, 2025

కడపలో భార్యను కడతేర్చిన భర్త అరెస్టు

image

కడప బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి భార్యను కిరాతగంగా భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంమండి వీధిలో నివాసముండే జమీల భాను(32) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. కాగా నిందితుడికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!