News December 5, 2024

కడప: ‘పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలి’

image

ఈనెల 7న మెగా పేరెంట్స్- టీచర్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు కడప జిల్లాకు రానున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కడపలోని పవన్ కళ్యాణ్ పర్యటించే మునిసిపల్‌ స్కూలులో ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు.

Similar News

News December 3, 2025

కడప: నవంబరులో తగ్గిన మద్యం ఆదాయం

image

కడప జిల్లాలో మద్యం ఆదాయం నవంబరులో భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠ స్థాయిలో రూ.83.38 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.101.31 కోట్లు, మేలో రూ.98.90 కోట్లు, జూన్‌లో రూ.97.31 కోట్లు, జూలైలో రూ.96.47 కోట్లు, ఆగస్ట్‌లో రూ.96.42 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.93.36 కోట్లు, అక్టోబర్‌లో రూ.93.44 కోట్లు, నవంబర్‌లో రూ.83.38 కోట్లు ఆదాయం వచ్చింది.

News December 3, 2025

కడప జిల్లాలో 60,411 హెక్టార్లలో పంటల సాగు.!

image

కడప జిల్లాలో రబీ పంట సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 60,411 హెక్టార్లలో(43.21%) పంటల సాగు జరిగింది. కేసీ కెనాల్ నీటి విడుదలపై స్పష్టత కరువై వరి 526 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వరి, గోధుమ, కొర్ర, రాగి, జొన్న తదితర ధాన్యం పంటలు 2,086 హెక్టార్లలో సాగు చేశారు. పప్పు దినుసులు 56,106 హెక్టార్లలో, నూనె గింజలు 1,654 హెక్టార్లలో, వాణిజ్య పంటలు 16 హెక్టార్లలో సాగయ్యాయి.

News December 3, 2025

దువ్వూరు: ఎర్రచందనం దొంగపై నాలుగోసారి PD యాక్ట్

image

దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన ఎర్రచందనం దొంగ ఇరుగంరెడ్డి నాగ దస్తగిరి రెడ్డిపై నాలుగోసారి పీడీ యాక్ట్ నమోదైనట్లు మైదుకూరు గ్రామీణ సీఐ శివశంకర్ యాదవ్ తెలిపారు. నాగ దస్తగిరి రెడ్డిపై ఇప్పటివరకు మొత్తం 128 కేసులు ఉన్నాయని అన్నారు. వీటిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 80, మరో 38 చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. ఈయన ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు.