News April 29, 2024
కడప పార్లమెంట్ పరిధిలో ఫైనల్ అభ్యర్థుల వివరాలు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి ఫైనల్ అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మొత్తం 47 నామినేషన్లు దాఖలు కాగా 20 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించామని, చివరకు 14 మంది ఎన్నికల పోటీలో నిలిచారన్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్‌రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో ఉన్నారన్నారు.
Similar News
News October 19, 2025
బద్వేల్ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్

బద్వేల్‌పై TDP అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ విషయంలో నియోజకవర్గంలోని ప్రజలకు IVRS కాల్స్ చేసి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితీశ్ రెడ్డి, DCC బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లను పేర్కొంది. బద్వేలులో ఎవరైనా నాయకుడిగా ఎదిగారంటే అది వీరారెడ్డి కుటుంబం దయేనని, రితీశ్ రెడ్డే తమ నాయకుడు అని పలువురు TDP నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు.
News October 19, 2025
కడప: తాళ్ల పొద్దుటూరు ఎస్సై సస్పెండ్

కడప జిల్లాలో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి, ప్రవర్తన సరిగ్గా లేవనే ఆరోపణలతో పెండ్లిమర్రి ఎస్సై <<18044279>>మధుసూధర్ రెడ్డిని<<>> సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలోనే తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనని కూడా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 19, 2025
పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై వేటు

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.