News April 29, 2024

కడప పార్లమెంట్ పరిధిలో ఫైనల్ అభ్యర్థుల వివరాలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి ఫైనల్ అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మొత్తం 47 నామినేషన్లు దాఖలు కాగా 20 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించామని, చివరకు 14 మంది ఎన్నికల పోటీలో నిలిచారన్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్‌రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో ఉన్నారన్నారు.

Similar News

News November 13, 2024

సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండండి: కడప ఎస్పీ

image

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగానూ.. పార్టీల మధ్య చిచ్చులు పెట్టేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలని కోరారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News November 12, 2024

శాసనసభ విప్‌లుగా ముగ్గురు కడప జిల్లా ఎమ్మెల్యేలు

image

కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్‌తో పాటు 15 మంది విప్‌‌లను ప్రకటించింది. ఇందులో కడప జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. వీరిలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి(TDP), జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(BJP), కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌‌(జనసేన)ను విప్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. NDA ప్రభుత్వం కడప జిల్లాలో మూడు పార్టీలకు సమన్యాయం చేశారని కూటమి నాయకులు భావిస్తున్నారు.

News November 12, 2024

ప్రొద్దుటూరు: సినీ పక్కీలో భారీ దొంగతనం

image

కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని నంగనూర్‌పల్లిలో మంళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. RTC ఏఎస్ఐ భైరగాని మునయ్య ఇంట్లో దొంగలు సుమారు 25 తులాల బంగారం, రూ.2 లక్షల  నగదు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనాన్ని గుర్తించకుండా సనీ పక్కీలో వారు ఇల్లంతా కారంపొడి చల్లి, తమ ముద్రలను కనపడకుండా జాగ్రత్త పడ్డారు.