News January 24, 2025
కడప: పాల కొండల్లో ఘనంగా శ్రీరామ అఖండ జ్యోతి

కడప నగరంలో బుధవారం శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం పాలకొండల్లో భక్తులు అఖండ విజయజ్యోతిని వెలిగించారు. అయోధ్య ఐక్యవేదిక కమిటీతోపాటు, పుష్పగిరి తీర్థ క్షేత్ర పరిరక్షణ కమిటీలతో పాలకొండల దిగువన ఆర్చీ వద్ద కొండపై ప్రత్యేకంగా చదును చేసిన ప్రాంతంలో 250 మీటర్ల వస్త్రాన్ని 50 లీటర్ల నేతిలో తడిపి చుట్టలుగా చుట్టి శివలింగం ఆకారానికి తెచ్చారు.
Similar News
News February 13, 2025
సిద్దవటం: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 5 ఏళ్ల జైలు శిక్ష

సిద్దవటం పీఎస్ పరిధిలో 2015 సం.లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 5 సం.ల జైలు శిక్ష, అలాగే ఒక్కొక్కరికి రూ. 1,000 జరిమానా విధిస్తూ గురువారం బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ పద్మ శ్రీ కోర్టులో తీర్పు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి, శిక్ష పడేలా కృషి చేసిన కె.రవిచంద్ర APP బద్వేల్, పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
News February 13, 2025
విద్యార్థులు సమాజంలో ఆదర్శంగా నిలవాలి: కడప ఎస్పీ

విద్యార్థులు ఉత్తమ చదువులతో అత్యున్నత స్థానాలకు చేరుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
News February 13, 2025
YS జగన్ రేపటి కడప పర్యటన షెడ్యూల్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడపకు రానున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహ వేడుకలకు జగన్ రానున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన నగర శివారులోని మేడా ఫంక్షన్ హాల్‌కు వెళ్తారు. నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి 11.30 గంటలకు కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లనున్నారు.