News April 4, 2024

కడప: పింఛన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృత్యువాత

image

పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటనలో పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన నారాయణమ్మ (70) బుధవారం పింఛన్ కోసం సచివాలయానికి వెళుతూ దారిలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందింది.

Similar News

News November 18, 2025

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌ను పూర్తి చేయాలి: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఈఆర్‌‌వోలను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక సమగ్ర సవరణ-2026పై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 1963 కేంద్రాలకు అదనంగా 158 కొత్త కేంద్రాలకు ప్రతిపాదనలు వచ్చాయని, దీనితో మొత్తం 2121 కేంద్రాలు అవుతాయని తెలిపారు. ఒకే కుటుంబం సభ్యులు ఒకే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.

News November 17, 2025

మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

image

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.