News August 3, 2024

కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ

image

పెన్షన్ల పంపిణీనీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

Similar News

News December 12, 2025

కడపలో హత్య.. వివాహేతర సంబంధమే కారణమా.?

image

కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ <<18541025>>హత్యకు వివాహేతర సంబంధమే<<>> కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

News December 12, 2025

BREAKING: కడపలో దారుణ హత్య.!

image

కడప జిల్లాలో శుక్రవారం ఉదయాన్నే ఓ హత్య జరిగింది. ఈ ఘటన కడపలోని స్వరాజ్ నగర్ వద్ద జరిగింది. వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 12, 2025

కడపలో కలకలం రేపుతున్న మేయర్ ఫ్లెక్సీ.!

image

మేయర్‌గా ఎన్నికైన మరుసటిరోజు పాకా సురేశ్‌కు షాక్ తగిలింది. ఇంటి పన్ను చెల్లించలేదంటూ కోటిరెడ్డి సర్కిల్‌లోని స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద భారీ కటౌట్ వెలిసింది. YCP రంగుతో ఏర్పడిన కటౌట్‌ను కొద్దిసేపటికి నగరపాలక అధికారులు తొలగించారు. ఈ ఫ్లెక్సీలో ఎవర్రా నన్ను ఆపేది.. ఇదేమి కర్మ మన కడపకు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. ఈ ఫ్లెక్సీ ఎవరు పెట్టారన్నదానిపై చర్చ జరుగుతోంది.