News April 9, 2024
కడప: ప్రత్యేక రైలు గడువు పొడిగింపు

కడప మీదుగా రాజస్థాన్ రాష్ట్రంలోని భగత్‌కి కోటికి వెళ్లే ప్రత్యేక రైలు గడువును మే 1వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. భగత్‌కి కోటి (04811) నుంచి ఈనెల 18, 27 తేదీల్లో బయలుదేరే రైలు కడప మీదుగా కోయంబత్తూరుకు వెళుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు (04812) నుంచి ఈనెల 22, మే 1 తేదీలలో బయలుదేరి భగత్‌కి కోటికి చేరుతుందన్నారు.
Similar News
News April 10, 2025
ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని సేవలో కడప కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం గరుడ సేవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ కుటుంబ సమేతంగా శ్రీ సీతారామలక్ష్మణులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు.
News April 10, 2025
ఒంటిమిట్టలో విద్యుత్ దీపాలంకరణలు

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో “ ఒంటిమిట్టకు తరలివచ్చిన అయోధ్య” అన్నట్టు శోభను సంతరించుకుంది. ఏకశిలానగరంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్‌తో ఏర్పాటు చేశారు.
News April 10, 2025
శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. గ్యాలరీల్లో ఉండే భక్తులకు కళ్యాణ తలంబ్రాలు, స్వామి వారి ప్రసాదం, అన్నప్రసాదాలను క్రమపద్ధతిలో అందించాలని సూచించారు.