News November 21, 2024

కడప: ప్రాధాన్యత రంగాలను పటిష్ఠం చేయాలి

image

ప్రాధాన్యతా రంగాలను పటిష్ఠం చేస్తేనే కడప జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై కలెక్టర్ సంబందిత అధికారులతో సమీక్షించారు.

Similar News

News November 22, 2024

పీయూసీ ఎన్నికకు ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి నామినేషన్

image

అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయన 2023లో టీడీపీ నుంచి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేకాకుండా కడప జిల్లాలో టీడీపీ విజయానికి ఆయన కృషి చేశారు. ఇటీవల పులివెందులలో జగనన్న లేఅవుట్లలో అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

News November 22, 2024

కడప జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

image

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాలికను ఓ యువకుడు లోబర్చుకోవాలనుకున్నాడు. దానికి అతడి స్నేహితులు సహకరించారు. వారిలో ఇద్దరితో ఆ బాలిక మాట్లాడుతుండగా ఇంకొకడు వీడియో తీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక తండ్రి నిన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

News November 22, 2024

కడపలోని ఏపీజీబీని అమరావతికి తరలించవద్దు 

image

కడప నగరం కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అమరావతికి తరలిపోతుందని వార్త జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గురువారం సీఎం చంద్రబాబును కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్యాంక్‌ను కడప కేంద్రంగానే కొనసాగించాలని ఉద్యోగులు, ప్రజల తరుపున విన్నవించారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దన్నారు.