News August 26, 2024
కడప: ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య

ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హతమార్చిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధవటం మండలం లింగంపల్లికి చెందిన గంగయ్య సంధ్యకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గంగయ్య లింగంపల్లి వాటర్ పంప్ వద్ద ఉద్యోగం చేస్తుంటారు. అయితే డ్యూటీ నుంచి ఇంటికి రాగా.. భార్య ప్రియుడితో ఉండటం చూసి ఆమెను మందలించాడు. కక్ష్య పెంచుకున్న భార్య ప్రియుడితో కలిసి గంగయ్యను హతమార్చి ఘాట్ రోడ్‌లో పడేశారు.
Similar News
News April 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,390
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,159
* 10 గ్రాముల వెండి ధర రూ.2,550.
News April 18, 2026
పులివెందుల టీడీపీలో వర్గపోరు?

పులివెందుల టీడీపీలో వర్గపోరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అంటీఅంటనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కోవర్టు అని వ్యాఖ్యానించారు. ప్రధాన నేతల మధ్యే సఖ్యత లేకపోతే ఎలా అని కార్యకర్తలు భావిస్తున్నారు.
News April 18, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 273 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 273 మందిపై కేసులు నమోదు చేసి, రూ.78,040 జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు.


