News October 1, 2024
కడప: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చిన వారికి బహుమతులు.. వివరాలివే.!

కడపలోని రాజీవ్ పార్క్ వద్ద <<14237927>>నేటి సాయంత్రం 5 గంటలకు<<>> నిర్వహించే కార్యక్రమానికి ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చేవారికి ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే.
1బాటిల్‌కి ఒక చాక్లెట్
1కేజీ ప్లాస్టిక్‌కు ఒక పెన్, మొబైల్ స్టాండ్
3కేజీల ప్లాస్టిక్‌కు పుష్‌బిన్
5 కేజీలకు డస్ట్‌బిన్ &ఫ్లవర్‌పాట్
15కేజీల ప్లాస్టిక్‌కు టీషర్ట్
500kgల ప్లాస్టిక్‌కు ఒక బెంచ్ గిఫ్ట్‌గా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. వివరాలకు 9949831750ఫోన్ చేయాలన్నారు.
Similar News
News July 7, 2025
కడప జిల్లాల్లో 159 మంది అరెస్ట్

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ‘జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న 159 మందిని అరెస్టు చేశాం. రూ. 2.85 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. 9మట్కా కేసుల్లో 16మందిని అరెస్టు చేసి రూ.50,570 సీజ్ చేశాం. రూ.1.4కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. బహిరంగంగా మద్యం తాగిన 986 మందిపై కేసులు నమోదు చేశాం’ అని SP చెప్పారు.
News July 6, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
News July 6, 2025
వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.