News August 18, 2024

కడప: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు

image

కడప జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో 1064 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 15, 2024

పర్యాటక దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 27న గండికోటలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులోని గండికోటలో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రంలో వైభవంగా పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

News September 15, 2024

కడప జిల్లా వాసులకు GOOD NEWS

image

కడప జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశం గండికోటలో నగరవనం, మైలవరం జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఈ మేరకు గండికోటలో ఏర్పాటు చేయబోయే నగరవనం స్థల పరిశీలనతోపాటు.. మైలవరం జలాశయంలో బోటింగ్‌ను శనివారం ఆయన పరశీలించారు. బోట్ ఎక్కి ఎంత దూరం ప్రజలను సౌకర్యవంతంగా తిప్పగలరు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.

News September 14, 2024

మెడికల్ షాప్ వారు పోలీస్ శాఖకు సహకరించాలి: SP

image

కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు ముమ్మరంగా చేయడంతో గంజాయి వ్యసనానికి అలవాటుపడ్డ యువత, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో మత్తు కలిగే మందుల కోసం మెడికల్ షాప్‌లకు వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించవద్దని జిల్లా SP హర్షవర్ధన్ రాజు, మెడికల్ షాప్ నిర్వాహకులకు శనివారం సూచించారు.