News May 13, 2024
కడప: బార్ల వద్ద బారులు తీరిన ప్రజలు
ఎన్నికల పోలింగ్ సమయం ముగియడంతో కడపలో బార్ల వద్ద మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. పోలింగ్ కు 48 గంటల ముందు అన్ని వైన్ షాప్ లు, బార్లను ముందస్తు చర్యలలో భాగంగా మూసివేశారు. పోలింగ్ ముగియడంతో ఎప్పుడెప్పుడు తీరుస్తారా అని మద్యం కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు తెరుస్తారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు కాపలా కాస్తున్నారు.
Similar News
News January 28, 2025
పులివెందుల: అన్నను హత్య చేసిన తమ్ముడు అరెస్టు
అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కేసులో తమ్ముడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు.. 2024 సెప్టెంబర్ 13న పులివెందుల(M) రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని బాబయ్య, తమ్ముడు బాబా ఫక్రుద్దీన్‌తో గొడవపడి కోపంలో సమ్మెటతో బలంగా కొట్టి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం సోమవారం అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది.
News January 27, 2025
కాశినాయన: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ భర్త మరణం
కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అల్లూరమ్మ భర్త చిన్న ఓబులేసు సోమవారం ఉదయం వరంగల్‌లో మరణించారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కుర్చీలో కూర్చుని ఉండగా హార్ట్ అటాక్ వచ్చి మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తదనంతరం వరంగల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఓబులేసు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News January 27, 2025
దువ్వూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి దువ్వూరు ఎస్‌ఐ వినోద్, పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.