News August 8, 2024
కడప: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

కడపలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని మహేశ్ అనే యువకుడు కిడ్నాప్ చేసి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. వారు లాడ్జిలో ఉన్నట్లు విద్యార్థిని అన్న ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకోగా అతడు పరారయ్యాడు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నేరానికి నిందితుడిపై బుధవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భాస్కర్ తెలిపారు.
Similar News
News December 17, 2025
కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.
News December 16, 2025
కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ?

కడప జిల్లా TDP అధ్యక్షుడి రేసులో ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు TDP ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన టికెట్ను త్యాగం చేయడం, అలాగే అవినాశ్రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన భూపేశ్కు పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు తీసుకొని నడిపించిన వాసునే కొనసాగించాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News December 16, 2025
క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


