News November 15, 2024

కడప: బిజినెస్ వైపు మహిళా సంఘాలను ప్రోత్సహించాలి.!

image

కడప జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలను ఈ-కామర్స్ బిజినెస్ వైపు అడుగులు వేయించి ప్రపంచ గుర్తింపుతో పాటు సంపూర్ణ సాధికారిత సాధించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పరిధిలో వివిధ రకాల పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. మహిళాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తెలిపారు.

Similar News

News December 3, 2024

అన్నమయ్య: సాయుధ దళాల దినోత్సవ స్టికర్ల ఆవిష్కరణ

image

డిసెంబర్ 7న సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్ ఫ్లాగ్‌లు, స్టిక్కర్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ దళాల త్యాగాలు, సేవలను గుర్తించేందుకు జెండా దినోత్సవం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు. మాజీ సైనికులు, వీరనారులు వారి కుటుంబాల సంక్షేమానికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News December 2, 2024

ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య

image

ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 2, 2024

కడప: నేడు జరగాల్సిన వైవీయూ డిగ్రీ పరీక్ష వాయిదా

image

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రద్దయిన పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత తెలియజేస్తామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేడు జరగాల్సిన పరీక్షలు మాత్రమే రద్దు చేశామన్నారు.