News November 27, 2024
కడప: భూ సేకరణ పనులు పూర్తిచేయాలి
జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాల క్లియరెన్స్ ప్రక్రియలను ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు సంబంధించి భూ సేకరణ తదితర అంశాలపై కడప కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News December 7, 2024
నేడు కడపకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే.!
నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉయదం 9:5కి బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో బయలుదేరి 10:15కి కడప ఎయిర్‌కి వస్తారు. అక్కడినుంచి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక 1:25కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని 2:15కి బేగంపేటలో దిగుతారు.
News December 6, 2024
కడప: ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు.. కానీ.!
రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్‌లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
News December 6, 2024
పుష్ప-2 రీసెర్చర్‌గా కడప జిల్లా వాసి
పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్ సుకుమార్‌ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్‌గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.