News November 25, 2024
కడప: మరదలితో అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య.!

మైదుకూరు మండలంలో నిన్న హత్య జరిగిన విషయం తెలిసిందే. చెర్లోపల్లికి చెందిన వీర నారాయణ యాదవ్కు బాలకృష్ణ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బాలకృష్ణ కువైట్ వెళ్లారు. డబ్బు కోసం వీర నారాయణ తరచూ బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. సమస్య ఏంటో చూడాలని బాలకృష్ణ తన అన్న సుబ్బరాజుకు చెప్పగా.. ఆయన కోపంతో వెళ్లి నారాయణను గొడ్డలితో నరికి హత్య చేశాడు.
Similar News
News December 13, 2025
వరంగల్లో బద్వేల్కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

కడప జిల్లా బద్వేల్కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
News December 13, 2025
కడప జిల్లాకు భారీగా నిధులు

కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.5కోట్ల నిధులు నీతి అయోగ్ విడుదల చేసిందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్, ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి అయోగ్ కార్యదర్శి శేఖర్కు కలెక్టర్ శ్రీధర్ న్యూఢిల్లీలో వివరించారు.


