News September 8, 2024
కడప: మహిళకు అరుదైన శస్త్రచికిత్స

కడపలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలకంఠరావు పేటకి చెందిన మహిళ గత నాలుగు నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యుల్ని సంప్రదించగా పరీక్ష చేసి కడుపులో సుమారు ఫుట్ బాల్ సైజులో రెండు కిలోల పైగా ఉన్న కణితిని గుర్తించారు. ఈ కణితిని కడపలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.
Similar News
News October 25, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 25, 2025
రాజుపాలెం: కుందూనదిలో దంపతుల ఆత్మహత్యాయత్నం?

రాజుపాలెం మండలంలోని వెళ్లాల సమీపంలోని కుందూ నదిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యాభర్తలు గొంగటి రామసుబ్బారెడ్డి, నాగ మునెమ్మ పడ్డారు. గమనించిన స్థానికులు నదిలో కొట్టుకుపోతున్న భర్తను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నాగ మునెమ్మ గల్లంతయారు. ఆమె కోసం గజఈత గాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. వీరు పెద్దముడియం మండలంలోని ఉప్పులూరుకు చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 25, 2025
కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.


