News September 8, 2024

కడప: మహిళకు అరుదైన శస్త్రచికిత్స

image

కడపలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలకంఠరావు పేటకి చెందిన మహిళ గత నాలుగు నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యుల్ని సంప్రదించగా పరీక్ష చేసి కడుపులో సుమారు ఫుట్ బాల్ సైజులో రెండు కిలోల పైగా ఉన్న కణితిని గుర్తించారు. ఈ కణితిని కడపలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.

Similar News

News October 15, 2024

మాజీ ఎమ్మెల్యేకు మూడు వైన్ షాపులు

image

ఉమ్మడి కడప జిల్లాలో వైన్ షాపుల లాటరీ ప్రక్రియ ఆసక్తికరంగా నడిచింది. పలు చోట్ల మహిళలు సైతం షాపులను దక్కించుకున్నారు. మరోవైపు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గండికోట ద్వారకనాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట అప్లికేషన్ వేయగా.. లాటరీలో మూడు షాపులు తగిలాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాల్లోని షాపులను ఆయన కైవసం చేసుకున్నారు.

News October 15, 2024

తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News October 14, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌ రాజీనామా ఆమోదం

image

యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు తప్పెట రామ ప్రసాద్ రెడ్డి ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉపకులపతిని కొద్దిరోజుల కిందట కలిసి కోరారు. ఆయన విజ్ఞాపన మేరకు విధుల నుంచి రిలీవ్ చేసినట్టు వైవీయూ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు.