News January 24, 2025
కడప: మహిళా సిబ్బంది పట్ల వేధింపులు.. అధికారిపై వేటు

కడప జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా ఉద్యోగులకు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిర్లక్ష్యంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అతడిపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు.
Similar News
News July 6, 2025
కడప: ‘రిమ్స్‌లో తనిఖీలు’

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సమితి సభ్యురాలు పద్మావతి శనివారం పర్యటించారు. పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్ఐసీయూలో పుట్టిన బిడ్డల ఆరోగ్య విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల చికిత్సకు వచ్చే పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించి ఆర్టీసీ అధికారులు, విద్యాలయ అధ్యాపకులతో చర్చించారు.
News July 5, 2025
ఎర్రగుంట్ల: ‘RTPPలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింపు’

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. ఇక్కడ పూర్తి ప్లాంట్ సామర్థ్యం 1650MW. వీటినుంచి ఏప్రిల్‌లో 839.98MU, మేలో 616.31MU, జూన్‌లో 729.28MU విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కేవలం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(PLF) మాత్రమే ఉపయోగిస్తున్నారు. RTPPలో 210X5MW, 600X1MW యూనిట్లు ఉన్నాయి.
News July 5, 2025
కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.