News August 6, 2024
కడప: మాజీ ఎమ్మెల్యేలకు ఊరట

కమలాపురంలో రైలు రోకో కోసం చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయ పల్లి మల్లికార్జున్ రెడ్డి, సలహాదారుడు సంబుటూరు ప్రసాద్ రెడ్డిపై నమోదైన కేసును మంగళవారం విజయవాడలోని వీఐపీ కోర్టు కొట్టివేసింది. 2022లో కమలాపురంలో అన్ని రైలు ఆపాలని అప్పటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. దీనిపై రైల్వే అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు.
Similar News
News February 24, 2026
కడప: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష.. 382 మంది గైర్హాజరు

ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు. 1,148 మంది ఒకేషనల్ విద్యార్థుల్లో 1,086 మంది హాజరవ్వగా.. 62 మంది పరీక్షలు రాయలేదు.
News February 24, 2026
కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.
News February 24, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.


