News April 12, 2025

కడప: ముగ్గురు బాలురు మృతి

image

ఆడుకోవడానికి ఊరు సమీపంలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి శుక్రవారం ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి కడప జిల్లా చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లికి చెందిన చొక్కరాజు దేవాన్ష్ (5), చొక్కరాజు విజయ్ (4), రెడ్డిచర్ల యశ్వంత్(5) ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.

News November 24, 2025

ప్రొద్దుటూరులో అంతా జీరో వ్యాపారమే..?

image

ప్రొద్దుటూరులో జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఇక్కడ ఫైనాన్స్, బంగారం, హవాలా, సినిమా, రియల్ ఎస్టేట్, ఎలక్షన్స్‌లో ఇక్కడి వ్యాపారులు రూ.వేల కోట్లు పెట్టుబడులు, రుణాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులు, పన్నులు లేకుండానే సాగుతున్నట్లు సమాచారం. వ్యాపారి శ్రీనివాసులుపై జీరోలో అభరణాలు, స్కీములు, చీటీల వ్యాపారంపై ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి.

News November 24, 2025

ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.