News December 20, 2024
కడప: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
Similar News
News November 29, 2025
కడప: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

కడప జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును డిసెంబరు 6 వరకు పొడిగించారు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని డీఈవో షంషుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. సమస్యలుంటే 80964 57660 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.
News November 29, 2025
కడప: భార్య కాపురానికి రాలేదని డెత్ సర్టిఫికెట్..ట్విస్ట్.!

కలసపాడు(M) దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మి కాపురానికి రాలేదని తన భర్త మారుతీరాజు డెట్ సర్టిఫికెట్ పంపినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరు గ్రామాల పెద్దల జోక్యంతో వారి మధ్య రాజీ కుదిర్చారు. మనస్పర్థలు తొలగిపోవడంతో ఆదిలక్ష్మి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని భర్తతో కలిసి కాపురానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
News November 29, 2025
కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.


