News March 13, 2025
కడప: ‘మౌలిక సదుపాయాలు కల్పించాలి’

కడప జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన జగనన్న కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగర శివారులోని జగనన్న కాలనీలను ఆయన ఈరోజు పరిశీలించారు. కనీసం ప్రజలు తాగేందుకు నీటి సదుపాయం కూడా లేకపోవడం నిజంగా దారుణం అన్నారు. రోడ్లు డ్రైనేజీ నీటి సదుపాయం కల్పించాలని కోరారు.
Similar News
News March 24, 2025
కడప: యథావిధిగా ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. జిల్లా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
News March 23, 2025
సిద్దవటం: పూరిల్లు దగ్ధం.. వృద్ధుడు సజీవ దహనం

సిద్దవటం మండలంలోని మూలపల్లిలో పూరిల్లు దగ్ధం కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అయ్యవారి రెడ్డి స్వామి సమీపంలోని సత్రం వద్ద ఆదివారం పూరి ఇంట్లో ఉన్న పిల్లి రాజారెడ్డి(75) వృద్ధుడికి కంటి చూపు కనపడదన్నారు. కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తుండగా ప్రమాదవ శాత్తు పూరింటికి మంటలు అంటుకొని అగ్నికి ఆహుతయ్యాడన్నారు. ఒంటిమిట్ట సీఐ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News March 23, 2025
పులివెందుల: వివేకా హత్య.. రంగంలోకి సిట్ బృందం

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ బృందం విచారణ చేపడుతోంది. అనుమానాస్పదంగా మృతి చెందిన సింహాద్రిపురం(M) కసనూరు (V)కు చెందిన కటిక రెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలిసింది. కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.