News March 12, 2025

కడప: యూత్ పార్లమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన JC

image

జాతీయ యూత్ పార్లమెంట్ ఉపన్యాసాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువత ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఉపన్యాసాల ద్వారా యువతలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పాల్గొన్నారు.

Similar News

News March 13, 2025

కడప: ‘మౌలిక సదుపాయాలు కల్పించాలి’

image

కడప జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన జగనన్న కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగర శివారులోని జగనన్న కాలనీలను ఆయన ఈరోజు పరిశీలించారు. కనీసం ప్రజలు తాగేందుకు నీటి సదుపాయం కూడా లేకపోవడం నిజంగా దారుణం అన్నారు. రోడ్లు డ్రైనేజీ నీటి సదుపాయం కల్పించాలని కోరారు.

News March 13, 2025

10th పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 17వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమరావతి నుంచి సీఎస్ విజయానంద్ కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు ఎస్పీ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News March 12, 2025

వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో కడప జిల్లా ఎమ్మెల్సీలు

image

తాడేపల్లెలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ లక్ష్యాలను ఆయన వివరించారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు. వైసీపీ వెన్నంటే నిలిచిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

error: Content is protected !!