News August 13, 2024
కడప: రామలక్ష్మణ నాణెం పేరిట మోసం

కడపకు చెందిన వ్యాపారి గంజికుంట రాజేంద్రని రూ.2 కోట్ల విలువైన రామక్ష్మణ కెమికల్ నాణేలు తమ వద్ద ఉన్నాయని వాటిని రూ.3 లక్షలకే ఇస్తామని విజయవాడకు పిలిపించి కిడ్నాప్ చేశారు. తన భార్యకు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. రాజేంద్ర బాత్ రూమ్కని చెప్పి ఫోన్లో తన బావకు జరగిందంతా మెసేజ్ చేశాడు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ పేట పోలీసులు అతడిని కాపాడారు.
Similar News
News December 10, 2025
కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News December 10, 2025
డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.