News August 13, 2024
కడప: రామలక్ష్మణ నాణెం పేరిట మోసం
కడపకు చెందిన వ్యాపారి గంజికుంట రాజేంద్రని రూ.2 కోట్ల విలువైన రామక్ష్మణ కెమికల్ నాణేలు తమ వద్ద ఉన్నాయని వాటిని రూ.3 లక్షలకే ఇస్తామని విజయవాడకు పిలిపించి కిడ్నాప్ చేశారు. తన భార్యకు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. రాజేంద్ర బాత్ రూమ్‌కని చెప్పి ఫోన్‌లో తన బావకు జరగిందంతా మెసేజ్ చేశాడు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ పేట పోలీసులు అతడిని కాపాడారు.
Similar News
News September 13, 2024
పులివెందుల: సొంత తమ్ముడిని చంపిన అన్న.. కారణం ఇదే.!
మతిస్థిమితం లేక సొంత తమ్ముడిని <<14090347>>అన్న చంపిన ఘటన<<>> రాయలాపురంలో చోటుచేసుకుంది. పులివెందుల అర్బన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాబయ్య తమ్ముడు బాబా ఫక్రుద్దీన్‌తో గొడవపడి కోపంలో సమ్మెటతో తమ్ముడిని బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.
News September 13, 2024
పులివెందుల: ‘నా కుమారుడి ఆరోగ్యం బాగుంది’
తన కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుందని వైఎస్ మధుసూధన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభిషేక్ తీవ్ర జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని ప్రస్తుతం బాగుందని వెల్లడించారు.
News September 13, 2024
నిండుకుండలా గండికోట జలాశయం
గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. జలాశయంలో 24.85 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు జనవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం 11 గంటలకు మైలవరం జలాశయానికి నీరు వదులుతున్నట్లు సమాచారం. అవుకు రిజర్వాయర్ నుంచి 10,000 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి వస్తున్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 2,990 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.