News March 27, 2025
కడప: రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం: బ్రహ్మయ్య

‘ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం’ నందు రుణాలు పొందేందుకు మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు డా. వల్లూరు బ్రహ్మయ్య తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పారిశీకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల ప్రాజెక్టు ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు పొందవచ్చన్నారు.
Similar News
News February 25, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.
News February 25, 2026
వేంపల్లి: నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రెండు గంటలకు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
News February 25, 2026
కడప: 3వ రోజు ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు

కడప జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షకు 96% విద్యార్థులు హాజరయ్యారు. నేడు 62 సెంటర్లలో 18,165 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,391 మంది రాశారు. 774 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 16,685 మందికి గాను.. 16,068 మంది హాజరవ్వగా, 617 మంది పరీక్షలు రాయలేదు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,480 మందికి గాను.. 1,323 మంది హాజరవ్వగా, 157 మంది గైర్హాజరయ్యారు.


