News July 3, 2024

కడప: రూ.1.90 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

image

ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం నందు దొరికిన రూ.1.90 కోట్లు విలువల గల 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోట్లదుర్తి క్రాస్ రోడ్డు వద్ద మినీ లారీలో రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నమన్నారు.

Similar News

News October 2, 2024

రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.

News October 2, 2024

జాతీయ సేవకులకు వైవీయూ పురస్కారాలు

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి యూనివర్శిటి స్థాయి జాతీయ సేవా పథక పురస్కారాలను ప్రకటించింది. సమాజ సేవా, ప్రజా చైతన్యం, జాతీయ సమైక్యత వంటి కార్యక్రమాలలో విశేష కృషిచేసిన ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, ప్రోత్సాహక అందించిన కళాశాలల జాబితాను వీసీ ప్రొ. కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. రఘునాథ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా.వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.

News October 1, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

image

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.