News July 3, 2024
కడప: రూ.1.90 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం నందు దొరికిన రూ.1.90 కోట్లు విలువల గల 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోట్లదుర్తి క్రాస్ రోడ్డు వద్ద మినీ లారీలో రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నమన్నారు.
Similar News
News October 14, 2024
అన్నమయ్య జిల్లా స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అందరూ కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సెలవు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు అంగన్వాడీలకు వర్తిస్తుంది. కాగా కడప జిల్లాకు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సెలవు ప్రకటించలేదు.
News October 14, 2024
కడప: నేటినుంచి యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం
కడప జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఆరిఫ్ తెలియజేశారు. నగరంలోని కెనరా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సెల్ ఫోన్ రిపేరింగ్ -సర్వీసింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ విభాగాలలో శిక్షణ ఉంటుందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
News October 13, 2024
కడప జిల్లాలో లాటరీ’ కిక్కెవరికో?
రాష్ట్రంలో మద్యం షాపులను సోమవారం లాటరీ ద్వారా కేటాయిస్తారు. 3396 షాపులకు వేర్వేరుగా లాటరీలు తీస్తారు. ప్రతి దరఖాస్తుదారునికి ఒక నంబరు కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. దీనికోసం కడప జిల్లాల్లో 139 మద్యం దుకాణాలకు లాటరీ కోసం కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 139 మద్యం దుకాణాల కోసం 3257 దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.