News July 23, 2024
కడప: రేపటి నుంచి అండర్-19 క్రికెట్ టోర్నమెంట్

కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ మైదానం, కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రికెట్ మైదానాలలో క్రెకెట్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 24 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఏసీఏ అండర్ -19 మల్టీ డేస్ అంతర్ జిల్లాల పోటీలు జరుగుతాయని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్ఆర్ జిల్లా ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీల్లో కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు జట్లు పాల్గొంటాయని తెలిపారు.
Similar News
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.
News November 21, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.