News June 4, 2024
కడప: లబ్ డబ్.. లబ్ డబ్..
అసెంబ్లీ ఎన్నికల చివరి అంకం నేడే. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 149 మందికి అనుక్షణం తాము గెలుస్తామా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ గతంలో 10కి 10 స్థానాల్లో గెలిచింది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్ని గెలిచేనో..?
గెలిస్తే: ఐదేళ్లు MLA.
అవకాశం వస్తే మంత్రి.
ఓడితే: రాజకీయ భవిష్యత్తు ఎటువైపన్నది కొందరికి ప్రశ్నార్థకం.
Similar News
News September 9, 2024
‘ఇసుక సరఫరాను నిబంధనలకు అనుగుణంగా సజావు పంపిణీ చేయాలి’
కడప జిల్లాలోని ఇసుక రీచులలో ఇసుక సరఫరాను ప్రభుత్వ తాజా నియమ నిబంధనలకు అనుగుణంగా సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా, కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శివ శంకర్ పాల్గొన్నారు.
News September 8, 2024
ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అండర్-18, 20, 23 మహిళలకు, పురుషులకు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు.
News September 8, 2024
కడప: ఈనెల 10న జాబ్ మేళా
కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, జమ్మలమడుగులోని న్యాక్ కేంద్రంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.