News September 18, 2024

కడప: వరద బాధితులకు 1వ తరగతి విద్యార్థిని విరాళం

image

విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. వివరాలిలా ఉన్నాయి. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయం చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్‌తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌కు తన పాకెట్ మనీ రూ.72,500 విరాళంగా అందించింది.

Similar News

News October 10, 2024

రైల్వేకోడూరు: రేబీస్ వ్యాధితో మహిళ మృతి

image

ఉమ్మడి కడప జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రైల్వే కోడూరు మండలం ఎ.బుడగుంటపల్లి పంచాయతీ వికాస్ నగర్‌కు చెందిన పులికి మునిలక్ష్మి(35)ని ఆమె పెంచుకున్న పెంపుడు కుక్క కాటేసింది. ఈక్రమంలో ఆమెకు రేబీస్ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.

News October 10, 2024

కడప: నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. ముగ్గురిపై కేసు

image

కడప జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెడ్ కానిస్టుబుల్‌తో సహా ముగ్గురిపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కాయపల్లెలో 15సెంట్ల స్థలానికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ బాషాతో పాటు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి నెల్లూరుకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తిని బెదిరించడంతో అతడు ఫిర్యాదు చేశాడు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అవ్వడంతో కేసులు నమోదు చేస్తున్నారు.

News October 10, 2024

చెర్లోపల్లి అడవిలో చిరుత..?

image

చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందినపెద్దగొర్ల సుబ్బరాయుడు మేకపై చిరుత దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. తిరిగి రాత్రి అదే స్థలానికి చిరుత వచ్చిందని బాధిత రైతు చెప్పారు. అటవీ శాఖ రేంజ్ అధికారి ధీరజ్, రైల్వేకోడూరు సబ్ డీఎఫ్‌వో సుబ్బరాజు గురువారం ఘటన స్థలానికి వెళ్లారు. ఆ జంతు పాదముద్రలను పరిశీలించారు. చిరుత పాద ముద్రలుగా ఉన్నట్లు గమనించారు..