News March 25, 2025
కడప: వాట్సాప్లో పదో తరగతి పేపర్ లీక్

కడప(D) వల్లూరు సెంటర్లో సోమవారం జరిగిన గణితం పరీక్షా పేపర్ లీక్ అయిందని డీఈవో షంషుద్ధీన్ స్పష్టం చేశారు. వేంపల్లె జిల్లా పరిషత్ పాఠశాల బీ కేంద్రంలో తనిఖీలు చేస్తుండగా మ్యాథ్స్ పేపర్ వాట్సాప్లో షేర్ అయింది. వల్లూరు స్కూల్లో వాటర్ బాయ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి పంపాడు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు.
Similar News
News March 31, 2025
అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం: తులసి రెడ్డి

విజయవాడ బాలోత్సవ భవన్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News March 31, 2025
రంజాన్ సందర్భంగా కడప జిల్లాలో భారీ బందోబస్త్

కడప జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలోనీ ఈద్గా వద్ద సోమవారం భద్రతను ఎస్పీ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన భద్రతను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్ ఈద్గాల వద్ద ప్రజలకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేశ్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.