News September 1, 2024
కడప విద్యార్థినికి రూ.1.70 కోట్ల ప్యాకేజీ

కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి అమెరికాలో ఏడాదికి రూ.1.70 కోట్ల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించారు. ఆమె జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపి దుర్గాపూర్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తిచేశారు. అనంతరం అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు.
Similar News
News November 4, 2025
ఒంటిమిట్టలో త్వరలో నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో త్వరలోనే నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన నిత్య అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రదేశాన్ని పరిశీలించారు. తాత్కాలిక ప్రమాద రహిత జర్మన్ షెడ్లతో నిత్య అన్న ప్రసాద కేంద్రం ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.
News November 3, 2025
వైవీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం ఇంటర్వ్యూ

కడపలోని వైవీయూలో బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఈనెల 6న ఉదయం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు బయోఇన్ఫర్మేటిక్స్ / బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ / ఎంటెక్ బయోఇన్ఫర్మేటిక్స్లో 5 ఏళ్ల MSc, నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం yvu.edu.in ని సందర్శించాలన్నారు.
News November 3, 2025
ఒంటిమిట్ట రామాలయంలో TTD క్యాలెండర్లు

TTD 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విక్రయిస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు TTD నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తామన్నారు.


