News May 22, 2024

కడప: ‘విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగనన్న విద్యాదీవెన డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని TNSF కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.

Similar News

News October 1, 2024

కమలాపురం వద్ద చెట్టును ఢీకొన్న కళాశాల బస్సు

image

కమలాపురం పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాను మంగళవారం ఉదయం చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కళాశాలకు చెందిన వ్యాను విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా కొండాయపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉండే చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News October 1, 2024

కడప: రోడ్డు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు?

image

కడప జిల్లా YVU యూనివర్సిటీ వద్ద సోమవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కాళ్లు విరిగి పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగా పరిగనించి వేలూరు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో కేవలం కాళ్లకు మాత్రమే కత్తితో నరికిన గాయాలు ఉండగా.. చివరికి <<14239401>>ఎవరో కాళ్లను నరికినట్లు<<>> అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులతోపాటు వారి బంధువులు కూడా అనుమానిస్తున్నారు.

News October 1, 2024

కడప: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చిన వారికి బహుమతులు.. వివరాలివే.!

image

కడపలోని రాజీవ్ పార్క్ వద్ద <<14237927>>నేటి సాయంత్రం 5 గంటలకు<<>> నిర్వహించే కార్యక్రమానికి ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చేవారికి ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే.
1బాటిల్‌కి ఒక చాక్లెట్
1కేజీ ప్లాస్టిక్‌కు ఒక పెన్, మొబైల్ స్టాండ్
3కేజీల ప్లాస్టిక్‌కు పుష్‌బిన్
5 కేజీలకు డస్ట్‌బిన్ &ఫ్లవర్‌పాట్
15కేజీల ప్లాస్టిక్‌కు టీషర్ట్
500kgల ప్లాస్టిక్‌కు ఒక బెంచ్‌ గిఫ్ట్‌గా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. వివరాలకు 9949831750ఫోన్ చేయాలన్నారు.